కళ్యాణ లక్ష్మి నిధులు పెంచాలి

551చూసినవారు
కళ్యాణ లక్ష్మి నిధులు పెంచాలి
రాష్ట్ర ప్రభుత్వం తులం బంగారం ఇవ్వకపోయినా, కనీసం కల్యాణ లక్ష్మి నగదునైనా పెంచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, కనీసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిధులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా అధికారులను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్