ధర్పల్లి గ్రంథాలయ ఇన్‌చార్జ్ లైబ్రేరియన్‌గా కొమ్ము శ్వేత బాధ్యతలు స్వీకరణ

7చూసినవారు
ధర్పల్లి గ్రంథాలయ ఇన్‌చార్జ్ లైబ్రేరియన్‌గా కొమ్ము శ్వేత బాధ్యతలు స్వీకరణ
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల గ్రంథాలయ శాఖ ఇన్‌చార్జ్ లైబ్రేరియన్‌గా కొమ్ము శ్వేత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన వాణి పదోన్నతిపై జగిత్యాల జిల్లాలోని కోరుట్లకు బదిలీ కావడంతో, ఆమె స్థానంలో శ్వేత బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ, పాఠకుల సహకారంతో ధర్పల్లి గ్రంథాలయాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్