ధర్పల్లి మండల కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

400చూసినవారు
ధర్పల్లి మండల కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు
ధర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రముఖ నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా పద్మశాలి కులబంధువులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం, సమాజ సేవను కొనియాడుతూ ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండ్యాల వినోద్, అక్షయ్, వైభవ్, చిలక నరేష్, అంకం గంగ స్వామి, డాక్టర్ ఆనంద్, కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్