ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు*

661చూసినవారు
ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు*
తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను శనివారం అధికారికంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, బీ. సి, పద్మశాలి కుల సంఘాల ప్రతినిధులు, తదితరులు వినాయకనగర్ లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.