న్యాయవాది జ్యూడిషియల్ కష్టడిపై న్యాయవాదుల నిరసన

2చూసినవారు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లడ రాజశేఖర్ రావు ఒక యువ న్యాయవాదిని 24 గంటల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశించడంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తీరును నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ నిరసన కార్యక్రమం నిర్వహించింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావు మాట్లాడుతూ, ఈ విషయంపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు తెలిపారు. నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు, దీంతో న్యాయవాదులు కోర్టులలో విధులు బహిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్