ప్రతి విద్యార్థి వేసవి సెలవులను వృధా చేయకుండా యోగాను నేర్చుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.
భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హరిచరణ్ పాఠశాలలో నిర్వహించిన ఉచిత ధ్యాన, యోగా శిబిరంలో ఆయన మాట్లాడుతూ, యోగాతో ఆరోగ్యంతో పాటు మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందని, ప్రస్తుత జీవన విధానంలో ఒత్తిడిని దూరం చేసుకోవడానికి యోగా సాధన ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ధ్యానం, సూర్య నమస్కారాలను నిత్య జీవనంలో భాగం చేసుకోవాలని సూచించారు.