మోపాల్ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. మోతీరాం నాయక్ తండా నుంచి కాల్పోల్ వెళ్లే దారిలో చిరుత కనిపించింది. ఈ ఘటనపై శనివారం ఉదయం అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. అధికారులు మోపాల్ను సందర్శించి, చిరుత ఆనవాళ్లను పరిశీలించారు. రాత్రి వేళల్లో అటవీ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లవద్దని గ్రామస్థులను అటవీశాఖ అధికారులు సూచించారు.