న్యాయవాదుల సంక్షేమ సాధనలో కలిసి నడుస్తా

3చూసినవారు
న్యాయవాదుల సంక్షేమ సాధనలో కలిసి నడుస్తా
సర్దార్ వల్లభాయ్ పటేల్ న్యాయవాదిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, తొలి ఉప ప్రధానిగా, సంస్థానాల ఏకీకరణలో కీలక పాత్ర పోషించారని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్, సీనియర్ న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, పటేల్ వారసునిగా, న్యాయవాదుల కుటుంబ సభ్యునిగా తనకు వారి సమస్యలు తెలుసని, వాటి పరిష్కారంలో పాలుపంచుకుంటానని తెలిపారు. పటేల్ కు తెలంగాణ సంస్థానానికి అవినాభావ సంబంధం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్