13 సంవత్సరాల అనంతరం విముక్తి

0చూసినవారు
13 సంవత్సరాల అనంతరం విముక్తి
నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పోరాడిన మల్యాల గోవర్ధన్, మధు, శంశోధిన్, అన్వర్, రామచందర్, యోగేష్, రాజు, కమల, మల్లేశ్, రాజేందర్ లపై నాటి TRS ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును 13 ఏళ్ల తర్వాత న్యాయస్థానం కొట్టివేసింది. న్యాయస్థానంలో కేసు గెలిచినప్పటికీ, ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయకపోవడం లోటుగా ఉందని నాయకులు పేర్కొన్నారు. ఆ స్థలంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించినా ఇప్పటికీ పంపిణీ చేయలేదని, కాంగ్రెస్ పార్టీ పేదలకు ఆ ఇళ్లను అందజేస్తే తమ పోరాటానికి సార్ధకత ఉంటుందని మల్యాల గోవర్ధన్ అన్నారు.

సంబంధిత పోస్ట్