నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం, నడిమి తండా గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి, ఉరుములు మెరుపులతో కూడిన పిడుగుపాటుకు రైతు ధారావత్ దేవి సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. నడిమితాండ గ్రామ సర్పంచ్ కేలు నాయక్ తమ్ముడు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రతి సంవత్సరం పిడుగుపాటుతో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.