నిజామాబాద్ నగర పరిధిలో దొంగతనాల నియంత్రణలో భాగంగా టౌన్–I పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టి, రైల్వే స్టేషన్ పరిధిలోని బస్టాప్ వద్ద ప్రయాణికుల నుంచి బంగారం దొంగతనం చేసిన ఒక మహిళా నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆమె వద్ద నుంచి మొత్తం నాలుగు తులాల రెండు గ్రాముల 250 మిల్లీగ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.