చెరువులో పడి వ్యక్తి మృతి

3చూసినవారు
చెరువులో పడి వ్యక్తి మృతి
డిచ్‌పల్లి మండలం దూస్ గాన్ చెరువులో స్నానానికి దిగి జగన్నాథం అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. నిజామాబాద్‌కు చెందిన జగన్నాథం శనివారం దూస్‌గాన్ గ్రామానికి పని నిమిత్తం వచ్చి, ఊరు చివరన గల కొత్త చెరువులో స్నానానికి దిగి పడిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.