నిజామాబాద్‌లోని ఫ్రూట్స్ మార్కెట్ దగ్గర ఫ్రెండ్స్ షాప్‌లో గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మైనర్ బాలుడు గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాడు. విచారణలో, శాంతినగర్‌కు చెందిన అబ్దుల్ జియా నుంచి గంజాయి తెప్పించుకుని, తండ్రి షేక్ ఏజాజ్‌తో కలిసి ఇతరులకు అమ్ముతున్నట్లు తెలిపాడు. వీరి వద్ద నుంచి 130 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. గంజాయి అమ్మినా, కొన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.