పోలీసుల అదుపులో గంజాయి స్మాగ్లర్

3చూసినవారు
పోలీసుల అదుపులో గంజాయి స్మాగ్లర్
నగరంలో గంజాయి వ్యాపారం చేస్తున్న బాబన్ సబ్ పహాడ్ ప్రాంతానికి చెందిన అఫ్రోజ్ ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా నగరంలో గంజాయి దందా సాగిస్తున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు, అఫ్రోజ్ ను గత కొద్ది రోజులుగా గాలిస్తున్నారు. గతంలో అనేక కేసుల్లో ఉన్న అఫ్రోజ్ ను పట్టుకోవడంతో, ఈ ముఠా వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. అఫ్రోజ్ తన గంజాయి వ్యాపారంలో సహకరిస్తున్న ఒకరిద్దరి పేర్లను వెల్లడించినట్లు సమాచారం. పోలీసులు ఈ బ్యాచ్ పై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్