Top 10 viral news 🔥

కాసీబుగ్గ తొక్కిసలాట ఘటన కలచివేసింది: చంద్రబాబు
AP: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తుల మృతి అత్యంత విషాదకరమని ట్వీట్ చేస్తూ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి లోకేశ్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.




