రామడుగులో VB-GRAMG పనులపై సర్పంచ్ అధ్యక్షతన సమావేశం

0చూసినవారు
రామడుగులో VB-GRAMG పనులపై సర్పంచ్ అధ్యక్షతన సమావేశం
నిజామాబాద్ జిల్లా రామడుగు గ్రామంలో రాబోయే ఆరు నెలల్లో VB-GRAMG పథకం కింద చేపట్టనున్న పనులపై బుధవారం గ్రామ సర్పంచ్ పార్వతి రమేష్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద పనుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసి, గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీధర్, ఉపసర్పంచ్ లోలం రాజేశ్వర్, ఫీల్డ్ అసిస్టెంట్ సిరికొండ అనిల్, పంచాయతీ కార్యదర్శి అశోక్ గౌడ్, పంచాయతీరాజ్ ఏఈ బాలాజీ, బీట్ ఆఫీసర్ నవీన్ రాజు, పాలకవర్గ సభ్యులు, ఐకేపీ, మహిళా సంఘాల ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్