మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

1చూసినవారు
మెగా జాబ్ మేళాకు విశేష స్పందన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా, టాస్క్ సౌజన్యంతో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో గురువారం శ్రీరామ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చారు. 71 కంపెనీలు పాల్గొన్న ఈ మేళాలో సుమారు 2000 మందికి ఉద్యోగాలు కల్పించబడ్డాయని నిర్వాహకులు ప్రకటించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి ఈ మేళాకు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్