హైదరాబాద్‌లో సోమవారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్ సంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులపై చర్చ జరిగినట్లు సమాచారం. అధికారులు తమ జిల్లాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.