ఎస్‌ఐఆర్‌పై ఎమ్మెల్యే భూపతి రెడ్డి కీలక ఆదేశాలు

544చూసినవారు
ఎస్‌ఐఆర్‌పై ఎమ్మెల్యే భూపతి రెడ్డి కీలక ఆదేశాలు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఏ ఒక్క అర్హుడైన ఓటరు ఓటు హక్కు కోల్పోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సూచించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆర్డీవో రాజేందర్ నేతృత్వంలో నియోజకవర్గంలోని తహసీల్దార్లతో ఎస్‌ఐఆర్, 22(ఏ) భూములు, రెవెన్యూ సమస్యలపై సమీక్ష నిర్వహించారు. బీఎల్‌ఓలను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, పెండింగ్ నోటీసులను పరిష్కరించడంతో పాటు అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయాలని సూచించారు. డూప్లికేట్ ఓట్లను నిబంధనల ప్రకారం గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్