ఆర్వోబిల మంజూరులో ఎంపీ ప్రత్యేక చొరవ

1చూసినవారు
ఆర్వోబిల మంజూరులో ఎంపీ ప్రత్యేక చొరవ
నిజామాబాద్​ జిల్లాలో మరో రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ఆర్వోబీ) నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఇందల్వాయి, జానకంపేట్​ గూడ్స్ షెడ్​ల వద్ద ఈ ఆర్వోబీలను నిర్మించనున్నారు. ఎంపీ అర్వింద్​ ధర్మపురి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​తో పాటు రైల్వే ఉన్నతాధికారులను కలిసి ఈ ప్రాజెక్టుల మంజూరు కోసం పలుమార్లు విజ్ఞప్తులు అందించారు. ఆయన కృషి ఫలితంగానే ఈ రెండు ఆర్వోబీలకు కేంద్రం పచ్చజెండా ఊపింది.

సంబంధిత పోస్ట్