వాడి వేడిగా మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం

324చూసినవారు
వాడి వేడిగా మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం
నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్​ కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు అధికారుల వైఫల్యంపై మండిపడ్డారు. ముఖ్యంగా శివారు కాలనీల్లో తాగునీటి సమస్య, స్వల్ప వర్షానికే డ్రైనేజీలు పొంగి రోడ్లపైకి మురికి నీరు చేరడం, రాత్రి వేళల్లో స్ట్రీట్ లైట్లు వెలగకపోవడం వంటి సమస్యలపై బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు తీవ్ర ఆరోపణలు చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమయ్యారని వారు ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్