ఈ నెల 3, 4 తేదీలలో నవీపేట్ ప్రధాన రైల్వే గేట్ మూసివేత

1చూసినవారు
ఈ నెల 3, 4 తేదీలలో నవీపేట్ ప్రధాన రైల్వే గేట్ మూసివేత
దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బి. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, నవీపేట వద్ద గల 188 నెంబర్ లెవెల్ క్రాసింగ్ రైల్వే గేటును మరమ్మతులు, డబ్లింగ్ పనుల కారణంగా ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 6 గంటల నుండి 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూసి ఉంచనున్నారు. 4వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత గేటును తెరిచి రాకపోకలను పునరుద్ధరిస్తారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు కమలాపూర్, మొకనపల్లి, గుండారం మీదుగా, ఇతర వాహనదారులు కల్యాపూర్, సాటాపూర్, తడ్బిలోలి, ఫకీరాబాద్ మీదుగా ప్రయాణించాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you