నిజామాబాద్ రూరల్ ఠాణా పరిధిలోని డాక్టర్స్ కాలనీలో గురువారం రాత్రి తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. యజమానులు విదేశాలకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం పని మనిషి ఇంటికి వచ్చి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యజమానులు విదేశాల నుంచి తిరిగి వస్తున్నారని, వారి దరఖాస్తు మేరకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని, దొంగల కోసం దర్యాప్తు చేస్తున్నామని ఎస్ హెచ్వో మహమ్మద్ ఆరీఫ్ తెలిపారు.