నిజామాబాద్: ఉప సర్పంచ్‌ పదవికి డిమాండ్‌: రాజకీయాల్లో కొత్త వ్యూహాలు!

7చూసినవారు
నిజామాబాద్: ఉప సర్పంచ్‌ పదవికి డిమాండ్‌: రాజకీయాల్లో కొత్త వ్యూహాలు!
నిజామాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉప సర్పంచ్‌ పదవికి డిమాండ్‌ పెరిగింది. సర్పంచ్‌ రిజర్వేషన్‌ తమకు అనుకూలంగా రాని గ్రామాల్లో చక్రం తిప్పే నాయకులు ఉప సర్పంచ్‌ పదవిపై దృష్టి సారించారు. మహిళలకు 50శాతం సర్పంచ్‌ స్థానాలు రిజర్వ్‌ కావడంతో చాలా మంది కీలకనాయకులకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో వారంతా ఉప సర్పంచ్‌ పదవి కోసం రంగంలోకి దిగుతున్నారు. సర్పంచ్‌ స్థానం మహిళలకు రిజర్వు అయిన చోట్ల తమ భార్యలను బరిలోకి దింపి తాము వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.