తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాల వారీగా జాగృతి కేడర్‌తో ఆమె సమీక్షలు నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధిపై 50 కమిటీల నివేదికలను చర్చిస్తూ కార్యకర్తల సలహాలు తీసుకోనున్నారు. రేపు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాల నాయకులు, కార్యకర్తలతో కవిత సమావేశం కానున్నారు.