నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడిలో గాయపడి, హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌమ్య ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.