గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదన్న కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం పెట్టుకుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ఈ ప్రభుత్వం 5 లక్షల రేషన్ కార్డులు ఇస్తే 10 నుంచి 15 లక్షల రేషన్ కార్డులను తీసేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గ్రామాల్లో చేసే సర్వేను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులపై ITని అప్లయ్ చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.