మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజు గురువారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు బుధవారం నామినేషన్లు అంతంతమాత్రంగానే నమోదయ్యాయి. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్లోనూ రెండో రోజు నామినేషన్లు అధిక సంఖ్యలో దాఖలయ్యాయి. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో, నామినేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.