కొనసాగుతున్న చేరికలు

2చూసినవారు
కొనసాగుతున్న చేరికలు
51వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బాలకిషన్, ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రధానమంత్రి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరినట్లు బాలకిషన్ తెలిపారు. రాబోయే ఇందూరు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోవడంలో, 'మన ఇందూరు మన మేయర్' నినాదంతో ముందుకు వెళుతూ కీలక పాత్ర పోషిస్తానని ఆయన పేర్కొన్నారు. ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధనపాల్, జిల్లా అధ్యక్షుడు దినేష్ అడుగుజాడల్లో పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్