దమ్మన్నపేట్ గ్రామంలో పీఏసీఎస్ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

1చూసినవారు
దమ్మన్నపేట్ గ్రామంలో పీఏసీఎస్ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ధర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో ఇందూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. గ్రేడ్-ఏ రకానికి రూ. 2, 461, సాధారణ రకానికి రూ. 2, 441 కనీస మద్దతు ధర చెల్లించనున్నట్లు తెలిపారు. రైతులకు ప్రభుత్వం సూచించిన రూ. 500 ప్రోత్సాహకం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ధాన్యంలో చెత్త, రాళ్లు, మట్టి లేకుండా శుభ్రంగా తీసుకురావాలని రైతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్