నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం జరిగింది. వివిధ గ్రామాల నుంచి హాజరైన తల్లిదండ్రులకు విద్యార్థుల విద్యా పురోగతి, పరీక్షల తీరు, మార్కులు, కళాశాల కార్యక్రమాలపై ప్రిన్సిపల్ టి. శ్రీనాథ్, సీనియర్ లెక్చరర్లు వివరించారు. ఈ సమావేశంలో
విద్యార్థులు కూడా పాల్గొన్నారు.