51 లక్షల విలువ చేసే పిడిఎస్ బియ్యం పట్టివేత

2చూసినవారు
51 లక్షల విలువ చేసే పిడిఎస్ బియ్యం పట్టివేత
హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, నిజామాబాద్ పౌర సరఫరాల శాఖ ఇన్స్పెక్టర్లు సంయుక్తంగా నిజామాబాద్ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ఖానాపురంలోని ఒక రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యాన్ని శుభ్రపరిచి, మళ్లీ పాలిష్ చేసి విక్రయించే ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో 800 క్వింటాళ్ల బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 51 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్