తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి, ప్రతి ఉద్యోగికి హక్కుగా ఉన్న ఇంక్రిమెంట్లు, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు ట్రెజరీ శాఖలో పెండింగ్లో ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన, గ్రామ పరిపాలన అధికారులు, రెవెన్యూ ఉద్యోగులతో సమస్యలను సమీక్షించి, వెంటనే ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కి నివేదిక సమర్పించారు.