పింఛన్ లైవ్ అతంటికేషన్

0చూసినవారు
పింఛన్ లైవ్ అతంటికేషన్
చేయూత పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. మృతి చెందిన వారి పింఛన్లు తొలగించడానికి లైవ్​ అథెంటికేషన్​ ప్రక్రియను ప్రారంభించింది. చేయూత లబ్ధిదారులు తాము జీవించే ఉన్నామని వేలిముద్ర, ముఖ గుర్తింపు ద్వారా నిరూపించుకోవాలి. నగరంలోని వినాయక నగర్ ప్రాంతంలో మున్నూరు కాపు సంఘంలో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. కాలనీలో పింఛన్​ పొందుతున్న వారు వచ్చి లైవ్​ అథెంటికేషన్​ చేయించుకోవాలని 45వ డివిజన్​ కార్పొరేటర్​ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you