దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు

1చూసినవారు
దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు
అక్టోబరు 31న ఎరుకల వాడలోని ఒక ఇంటిలో బీరువా పగలగొట్టి బంగారు ఆభరణాలు, రూ. 1500 నగదు దొంగిలించిన కేసులో 1వ టౌన్ పోలీసులు ఇద్దరు పాత నేరస్థులను అరెస్టు చేశారు. మీర్జా అతర్ బైగ్, షేక్ అంజాద్ అనే నిందితులు ఆదివారం గంజ్ మార్కెట్లో నగలను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుండగా అనుమానం వచ్చి పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు ముక్కు పుడక, ఉంగరం, వెండి కడియాలు, మొబైల్ ఫోన్, 1500 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలో కూడా దొంగతనాలు, హత్యాయత్నం కేసులు ఉన్నాయని సీఐ రఘుపతి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్