పోలియో చుక్కలు తప్పనిసరి: సర్పంచ్ భూమేష్

714చూసినవారు
పోలియో చుక్కలు తప్పనిసరి: సర్పంచ్ భూమేష్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని సితాయిపేట్ గ్రామంలో ఆదివారం పోలియో దినోత్సవం సందర్భంగా సర్పంచ్ సిహెచ్ భూమేష్ పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 0 నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు తల్లిదండ్రులు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఆమె సూచించారు. సోమ, మంగళవారాల్లో కూడా ఇంటింటికి ఆశ వర్కర్లు తిరిగి పోలియో చుక్కలు వేస్తారని, కావున ప్రతి ఒక్కరూ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్