జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిజాంబాద్ నగరంలోని దుబ్బ పట్టణ ఆరోగ్య కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ శ్రీ భుజంగరావు చేతుల మీదుగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ ఈ విషయాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఐదు సంవత్సరాలలోపు చిన్నారులందరికీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు బూత్‌లలో పోలియో చుక్కల మందు అందించాలని, 90 శాతం కంటే ఎక్కువ పిల్లలకు టీకా వేయాలని, ఎవరూ తప్పిపోకుండా పకడ్బందీ ప్రణాళికతో కార్యక్రమాన్ని నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు.