గోదావరి పుష్కర పనుల ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలి

0చూసినవారు
గోదావరి పుష్కర పనుల ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలి
గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, పుష్కరాలను పురస్కరించుకుని చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. దేవాదాయ, నీటి పారుదల శాఖలు సవరించిన ప్రతిపాదనలను బుధవారం లోగా, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ తదితర శాఖలు రెండు రోజుల్లో సమగ్ర ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ముఖ్యంగా కందకుర్తి ప్రాంతంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్