ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం చరిత్ర శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిజామాబాద్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై క్విజ్ పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. జ్యోతి నిజామాబాద్ జిల్లాలోని ప్రాచీన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, వారసత్వ ప్రదేశాల విశిష్టతను విద్యార్థులకు వివరించారు. చారిత్రక ప్రదేశాల ప్రాధాన్యతను తెలుసుకోవడంతో పాటు వాటి పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.