నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ రైల్వే కమాన్ వద్ద రైల్వే డబ్లింగ్ పనులు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పనులు 90 రోజుల పాటు కొనసాగుతాయి. పనుల కారణంగా అటువైపు వెళ్లే ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లించారు. రావడానికి, వెళ్లడానికి రెండు మార్గాలు ఉండగా, పనులను ఒక్కో పక్క 45 రోజుల చొప్పున పూర్తి చేస్తారు. రైల్వే బ్రిడ్జి వద్ద వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది.