ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు గడుగు గంగాధర్ కలిశారు. పంట మార్పిడిపై కమిషన్ సభ్యులు ముఖ్యమంత్రికి నివేదికను అందజేశారు. ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి కూడా పాల్గొన్నారు. పంట మార్పిడిపై ప్రభుత్వం సమగ్రంగా చర్చించాలని భావిస్తోంది. అసెంబ్లీలో ప్రత్యేక చర్చ ఏర్పాటు చేసి, మరింత అధ్యయనం చేసి, నిర్మాణాత్మక సూచనలతో ముందుకు రావాలని సూచించారు.