కలెక్టరేట్ లో స్వీయ గణనలో పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగులు

1చూసినవారు
కలెక్టరేట్ లో స్వీయ గణనలో పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగులు
జనాభా గణన-2027లో భాగంగా కొనసాగుతున్న "స్వీయ గణన" ప్రక్రియలో భాగంగా బుధవారం కలెక్టరేట్ లో రెవెన్యూ ఉద్యోగులు స్వీయ నమోదు చేసుకున్నారు. ఉద్యోగులు ఎవరికి వారు తమ కుటుంబ వివరాలను పోర్టల్‌లో నమోదు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి వారిని అభినందించారు. మిగతా శాఖల ఉద్యోగులు కూడా వీరిని స్పూర్తిగా తీసుకుని స్వీయ గణన చేసుకోవాలని సూచించారు. ఈసారి జనాభా గణన-2027 డిజిటల్ విధానంలో నిర్వహించబడుతోందని తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు పోర్టల్ ద్వారా స్వీయ నమోదు చేసుకోవచ్చని సూచించారు.

ట్యాగ్స్ :