నిజామాబాద్ జిల్లాలో, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న వి. భుజంగరావుకు రెవెన్యూ అదనపు కలెక్టర్ బాధ్యతలు కూడా అప్పగించారు. గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన కిరణ్ కుమార్ మంగళవారం ఉద్యోగ విరమణ చేయడంతో ఈ మార్పు జరిగింది. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం నుండి సమాచారం అందింది.