నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కార్యాలయంలో ఎంపీడీవో. బి. మారుతి, ఎంపీవో. శ్రీధర్ ఆధ్వర్యంలో జలసిరి కార్యక్రమంపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు, ప్రతి గ్రామంలో వ్యవసాయ కుంటలు, సాధ్యమైన చోట ఇంకుడు చెరువుల ఏర్పాటుపై అధికారులు సూచనలు చేశారు. అలాగే గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, అభివృద్ధి పనులు, గ్రామపంచాయతీ రికార్డుల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.