ధర్పల్లి మండల కార్యాలయంలో జలసిరి కార్యక్రమంపై సమీక్ష సమావేశం

115చూసినవారు
ధర్పల్లి మండల కార్యాలయంలో జలసిరి కార్యక్రమంపై సమీక్ష సమావేశం
ధర్పల్లి మండల కార్యాలయంలో బుధవారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమం అమలుపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని, వ్యవసాయ కుంటల నిర్మాణంలో ప్రతి వీఓ గ్రూపు నుంచి రెండు, ప్రతి గ్రామపంచాయతీ నుంచి మూడు చొప్పున మొత్తం ఐదు కుంటలు నిర్మించాలని సూచించారు. అవసరమైతే ఈ సంఖ్యను పెంచుకోవచ్చని, ప్రతి గ్రామపంచాయతీలో కనీసం ఒక ఇంకుడు చెరువు ఏర్పాటు చేయాలని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్