నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఎస్. రామన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సీఐగా పనిచేసిన బిక్షపతి జిల్లా కేంద్రానికి బదిలీ కావడంతో ఆయన స్థానంలో రామన్ నియమితులయ్యారు. ధర్పల్లి, సిరికొండ మండలాల ప్రజలు, పోలీసు సిబ్బంది సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని సీఐ రామన్ తెలిపారు.