త్రిమూర్తి గణనాధుని దర్శించుకున్న సర్పంచ్

0చూసినవారు
త్రిమూర్తి గణనాధుని దర్శించుకున్న సర్పంచ్
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలోని త్రిమూర్తి గణేష్ మండపం వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, వీసీడీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్, వార్డు సభ్యుడు రాజ్‌కుమార్, యువకులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, నిమజ్జనం సమయంలో యువకులు అప్రమత్తంగా ఉండి భద్రతా జాగ్రత్తలు పాటించాలని సర్పంచ్ సూచించారు.

సంబంధిత పోస్ట్