గిరి రాజ్ కళాశాల భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శనివారం సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపాల్ రామ్మోహన్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రంగరత్నం హాజరయ్యారు. భవిష్యత్ అవసరాలకు సన్నద్ధం కావాలని విద్యార్థులకు వారు సూచించారు. సైన్స్, క్విజ్, వ్యాసరచన, సామూహిక చర్చ వంటి పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.