జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ, ఐడిఓసి ఉద్యోగులకు నిర్వహిస్తున్న జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షల రెండవ రోజు ఆరోగ్య శిబిరాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఐడిఓసిలోని సుమారు 800 మంది ఉద్యోగులు హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఉద్యోగి తమ జీవనశైలిలో మార్పులు చేసుకుని, ఈ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె నొక్కి చెప్పారు.