హోలీ పండగ సందర్భంగా శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని, మంగళవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు పోలీసు కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1960 ప్రకారం, కామదహనం, హోలీ పండగ నేపథ్యంలో జిల్లాలోని కల్లు దుకాణాలు, డిపోలు, ఐఎంఎల్, ఏ4 షాప్ లు, బార్లు, క్లబ్లు, ట్యాడి దుకాణాలు, టీసీఎస్ దుకాణాలు మూసి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.